: యోగా... చాలా కష్టం బాసూ!: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్య


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరాటేలో కింగే. బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన కరాటే పోజులతో పాటు సినీ హీరోలా చొక్కా విప్పి తిరిగిన ఫొటోలు కూడా మనం చూశాం. అయితే యోగా అంటే మాత్రం ఆయన బెంబేలెత్తిపోతారట. ఎందుకంటే, యోగాసనాలు వేయడం మహా కష్టమంటారాయన! అసలీ విషయం ఎలా వెలుగు చూసిందంటే... మొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు పుట్టిల్లయిన భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ యోగాసనాల్లో మునిగిపోయాయి. అయితే పుతిన్ మాత్రం యోగాసనాలు వేసిన దాఖలా కనిపించలేదు. దీనిపై పుతిన్ ను ఆరా తీస్తే ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. యోగా తనకు కష్టంగా అనిపిస్తుందనీ, ఈ కారణంగానే తాను యోగా అభ్యసించడానికి అసలు ప్రయత్నించలేదని ఆయన చెప్పేశారు.

  • Loading...

More Telugu News