: నాలుగో రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె... పేరుకుపోతున్న చెత్తా చెదారం


కనీస వేతనాల కోసం ఆందోళన బాట పట్టిన తెలంగాణ మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. పలు ప్రాంతాల్లోని డస్ట్ బిన్ ల వద్ద దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఫలించలేదు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నాయిని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు, ఈ విషయంలో స్వయంగా కేసీఆర్ హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే, కార్మికుల సమ్మె కారణంగా హైదరాబాదులో చెత్తా చెదారం పేరుకుపోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని దాఖలైన పిటీషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News