: 'సింగర్లంతా సిగ్గుతో తలదించుకోవాలి' వీడియోపై శ్రేయా ఘోషల్ స్పందన


'మీరు చేస్తున్నపని తక్షణం ఆపేయండి...ఈ పాట వినండి... పాట వింటే ప్రొఫెషనల్ సింగర్లంతా సిగ్గుతో తలదించుకోవాలి' అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోపై బాలీవుడ్ స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ స్పందించింది. తుంపా కుమారిని తక్షణం చూడాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేసింది. 'ఆషికీ-2' సినిమాలో తను పాడిన 'సున్ రహా హే నా తూ' పాటను అవలీలగా పాడిన తుంపాకుమారిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపింది. ఆమె ఎవరు? ఎక్కడుంటుంది? అర్జెంట్ గా కలుసుకోవాలని ఉంది అంటూ ట్విట్టర్లో ఆసక్తి వ్యక్తం చేసింది. 'తుంపా కుమారి తనలా పాడలేదని, తనకంటే గొప్పగా పాడిందని' శ్రేయా ఘోషల్ అభిప్రాయపడింది. అత్యంత సులభంగా ఆరోహణ, అవరోహణ, గమకాలు పాడేసిందని కితాబిచ్చింది. కాగా, తుంపా కుమారి పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ పాటను చూశాక కామెంట్, లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఇంతా చేసి పాట పాడిన బాలిక అంధురాలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సానబడితే దేశం గర్వించదగ్గ గాయనిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News