: నా ఫోటో మార్ఫింగ్ చేశారు: పోలీసులనాశ్రయించిన సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన తన ఫోటో వాట్సప్ లో ప్రత్యక్షం కావడంపై సల్లూభాయ్ ఆందోళన వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలతో సల్మాన్ ఇమేజ్ ను మార్ఫింగ్ చేసిన ఆగంతుకులు వాట్సప్ లో అప్ లోడ్ చేశారు. దీనిపై సల్మాన్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోటోను మార్ఫింగ్ చేసిన వారిపై విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని సల్మాన్ డిమాండ్ చేస్తున్నాడు.