: మంచిగా చెప్తున్న... అర్థం చేసుకోండి: మున్సిపల్ కార్మికులకు నాయిని విజ్ఞప్తి


మంచిగా చెప్తున్నా... అర్థం చేసుకోండని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మున్సిపల్ కార్మికులకు సూచించారు. హైదరాబాదులో మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు విఫలమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించాలని సూచించారు. రంజాన్ మాసం నడుస్తున్నందున సమ్మె విరమిస్తే అందరికీ మంచిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాదు అని చెబుతుంటే, మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కమిషనర్ కు చెప్పామని, ఆయన కార్మికుల జీతాలపై నిర్ణయం తీసుకుంటారని, తక్షణం సమ్మె ముగించి ఇళ్లకు వెళ్లాలని ఆయన సూచించారు. మున్సిపల్ కార్మికులు ఇలాగే సమ్మె చేస్తామని పట్టుపడితే, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తాను కార్మికుల సంక్షేమం కోరుకుంటానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News