: బాల్క సుమన్ పై జూబ్లీహిల్స్ పీఎస్ లో జనసేన కార్యకర్తల ఫిర్యాదు
టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై జనసేన కార్యకర్తలు హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 'ప్యాకేజ్ కల్యాణ్' అంటూ సుమన్ జనసేన అధినేతను విమర్శించారంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ ను విమర్శించే స్థాయి సుమన్ కు లేదన్న జనసేన కార్యకర్తలు, తమ అధినేతకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే, సుమన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమన్ పై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.