: పెట్రోల్ బంక్ ల వద్ద ఉత్తరాలు పోస్ట్ చేయచ్చు!
ఉత్తరం పోస్టు చేయడానికి, పెట్రోల్ బంక్ కి వెళ్లడానికి లింకేంటని అనుకుంటున్నారా? మొబైల్, ఇంటర్నెట్ ఆగమనంతో ఉత్తరాలను ప్రజలు దాదాపు మరచిపోయారనే చెప్పచ్చు. దీంతో పోస్టాఫీసులకు గతంలోలా ఉత్తరాల బట్వాడా టెన్షన్ తగ్గింది. ఎస్ఎంఎస్, స్మార్ట్ పోన్లు రావడంతో టెలిగ్రాం అంతరించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళనాడు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉత్తరాలు పోస్టు చేయాలంటే పోస్ట్ ఆఫీస్ వెతుక్కుని వెళ్లే ఇబ్బంది లేకుండా, పెట్రోల్ బంక్ ల దగ్గర పోస్ట్ డబ్బాలు ఏర్పాటు చేస్తోంది. అలా చేయడం ద్వారా ఉత్తరాలకు ఆదరణ పెంచవచ్చని, అలాగే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 8 పెట్రోల్ బంక్ లలో టీవీ టైప్ పోస్టు బాక్సులను ఏర్పాటు చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పోస్టు బాక్స్ లను ఏర్పాటు చేయనున్నామని తపాలాశాఖాధికారులు తెలిపారు.