: జిమ్ లో వాడే స్టెరాయిడ్స్ తో మతిమరుపు వస్తుందట


ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కోసం కావచ్చు, కండలు పెంచడానికి కావచ్చు జిమ్ కు వెళుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కండరాల పెరుగుదల కోసం కొంత మంది జిమ్ లో స్టెరాయిడ్స్ కూడా వాడుతుంటారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతాయని యూకేలోని నార్తంబ్రియా యూనివర్శిటీకి చెందిన మానసిక శాస్త్ర నిపుణుడు డాక్టర్ టామ్ తెలిపారు. ఆండ్రోజెనిక్, అనబాలిక్ స్టెరాయిడ్స్ ను సుదీర్ఘంగా తీసుకుంటే మతిమరుపును ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న జిమ్ చేస్తున్న వారిని పరిశీలించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు.

  • Loading...

More Telugu News