: మా దేశం అదృశ్యమైపోతోంది... సాయం చేయండి: ఈయూ దేశాలకు 'తువాలూ' ప్రధాని విజ్ఞప్తి
తువాలూ... ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లో నాలుగోస్థానంలో ఉన్న దేశం. ఈ ద్వీప సమూహం ఇప్పుడు ప్రమాదంలో పడింది. పది వేల జనాభా ఉన్న ఈ చిరు దేశాన్ని సముద్రం క్రమేణా కబళిస్తోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి పట్ల తువాలూ ప్రధాని ఎనెలే స్పోగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం భూమండలం నుంచి అదృశ్యం కాకుండా కాపాడాలని ఆయన యూరోపియన్ యూనియన్ నేతలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో స్పోగా బ్రస్సెల్స్ వచ్చారు. డిసెంబరులో పారిస్ లో జరిగే ఐరాస 'వాతావరణ మార్పు' సదస్సులో ఈ అంశంపై చర్చించాలని కోరనున్నారు. ఇక, గ్రీన్ హౌస్ వాయువుల విడుదల శాతాన్ని తగ్గించాలని యూరప్ కు సూచించారు. ప్రపంచాన్ని కాపాడేందుకు తువాలూను కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.