: మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే చింతమనేని దాడి
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక రీచ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న వనజాక్షి వెంటనే అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పడంతో ఇసుక రీచ్ వద్దకు వచ్చి తహశీల్దార్ పై దాడి చేయడంతో భయంకర వాతావరణం నెలకొంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక రీచ్ కు చేరుకున్నారు.