: రక్షణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా, 40వేల మంది సైనికులను తొలగించుకోనున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికా తన రక్షణ వ్యయాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో, 40 వేల మంది సైనికుల్ని తొలగించనున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్మీ కోసం పనిచేస్తున్న 17వేల మంది పౌరుల్ని సైతం తొలగిస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం అమలైతే... 2017 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అమెరికా సైన్యంలో 4,50,000 మంది సైనికులు మాత్రమే ఉంటారు.