: నాని! దమ్ముంటే రాజీనామా చెయ్...జనసేన అభ్యర్థిపై పోటీ చెయ్!: జనసేన కార్యకర్తలు


దమ్ముంటే కనుక కేశినేని నాని రాజీనామా చేసి జనసేన అభ్యర్థిపై పోటీ చేసి విజయం సాధించాలని జనసేన కార్యకర్తలు సవాలు విసిరారు. తిరుపతిలో జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించిన సందర్భంగా టీడీపీ ఎంపీలు కేశినేని నాని, సుజనా చౌదరిపై విమర్శలు చేశారు. 'పవన్ కల్యాణ్ ను విమర్శించడం హీరోయిజం అనుకుంటున్నారా?' అంటూ వారు నిలదీశారు. చేతనైతే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావాలని వారు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ యువకుల్లో గూడుకట్టుకున్న ఆలోచనలను పవన్ కల్యాణ్ వెల్లడిస్తే, ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని వారు ఆరోపించారు. పవన్ కల్యాణ్ లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదా? అని వారు నిలదీశారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ అవసరం లేదని చెప్పి ఉంటే బాగుండేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని బొమ్మ ముద్రించిన ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు దగ్ధం చేశారు.

  • Loading...

More Telugu News