: 18 వేల మందిని తొలగించారు... మరింత మందిని తీసేస్తామంటున్న మైక్రోసాఫ్ట్


అధునాతన సాంకేతికత, ఆటోమేషన్ పేరు చెప్పి గడచిన సంవత్సరం వ్యవధిలో వివిధ స్థాయుల్లో 18 వేల మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ మరింత మందిని తొలగించనున్నామన్న సంకేతాలు పంపింది. ఖర్చులను మరింతగా తగ్గించుకోవాలని భావిస్తున్నామని, ఈ దఫా హార్డ్ వేర్ విభాగంలో పనిచేస్తున్న వారిని తొలగించే అవకాశాలు ఉన్నాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం నోకియా వ్యాపారాన్ని 7.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 43 వేల కోట్లు) తో కొనుగోలు చేసిన తరువాత ఆమేరకు ఆదాయాన్ని పెంచుకోవడంలో మైక్రోసాఫ్ట్ విఫలమైన సంగతి తెలిసిందే. నష్ట నివారణకు మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆన్ లైన్ డిస్ ప్లే అడ్వర్టయిజింగ్ వ్యాపారాన్ని జూన్ లో ఏఓఎల్ కు విక్రయించింది కూడా. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో హార్డ్ వేర్ రంగం నుంచి దశలవారీగా తప్పుకోవాలని సంస్థ భావిస్తోంది.

  • Loading...

More Telugu News