: జాతీయ గీతంలో మార్పులు చేయాలనడం సరికాదు: త్రిపుర గవర్నర్


రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ప్రతిపాదనను త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ వ్యతిరేకించారు. జాతీయ గీతంలో మార్పులు చేయాలనుకోవడం సరైన చర్య కాదన్నారు. జాతీయ గీతంలోని 'అధినాయక' పదాన్ని తొలగించి 'మంగళ' అనే పదంతో మార్పు చేయాలన్న సూచనను ఆయన తిరస్కరించారు. 67 ఏళ్లుగా ఉన్న పదాన్ని తొలగించాల్సిన అవసరం లేదని చెప్పారు. అధినాయక పదం బ్రిటీషు ప్రభుత్వ అధిపతిని స్తుతించేది కాదని తాను భావిస్తున్నట్టు రాయ్ పేర్కొన్నారు. రవీంద్ర నాథ్ ఠాగోర్ సొంత రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ కు చెందిన బీజేపీ సీనియర్ నేతే తథాగత రాయ్.

  • Loading...

More Telugu News