: కజక్ అధ్యక్షుడికి మోదీ బహుమానం
కజికిస్థాన్ నుంచి రష్యా బయల్దేరే ముందు ఆ దేశాధ్యక్షుడు నుర్ సుల్తాన్ నజర్ బయేవ్ కు మోదీ బహుమతి అందజేశారు. గత పదేళ్లుగా ఆస్తానాలో వివిధ మత సమ్మేళనం నిర్వహిస్తున్న నజర్ బయేవ్ కు భారత్ లో ఆవిర్భవించిన వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను బహూకరించారు. 'గురు గ్రంధ్ సాహిబ్' ఆంగ్ల అనువాదం, ప్రాకృతంలో ఉన్న బద్రభాహు విరచిత కల్పసూత్ర, సంస్కృతంలో రాసిన అష్టసహస్రిక ప్రజ్ఞ పారమిత, పర్షియన్ అనువాదమైన వాల్మీకి రామాయణం ఉన్నాయి.