: వద్దన్నా ఫోన్ చేసి విసిగించినందుకు రూ. 1.4 కోట్ల ఫైన్
పదేపదే ఫోన్లు చేసి విసిగిస్తున్న ఓ టెలికం సంస్థకు యూఎస్ కోర్టు 2,29,500 డాలర్ల (సుమారు రూ. 1.44 కోట్లు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే, టైమ్ వార్నర్ కేబుల్ అనే టెలికం సంస్థ నుంచి టెక్సాస్ కు చెందిన అరసెలీ కింగ్ అనే మహిళకు విపరీతంగా మార్కెటింగ్ ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. విసిగిపోయిన అరసెలీ సదరు టెలికం కార్యాలయానికి ఫోన్ చేసి ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయవద్దని హెచ్చరించింది కూడా. అయినా సరే పట్టించుకోని టైమ్ వార్నర్ టెలికం ఫోన్ చేస్తూనే వుంది. ఏడాది వ్యవధిలో 153 సార్లు కాల్ చేసి విసిగించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అరసెలీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన మన్ హటన్ ఫెడరల్ జడ్జి తీర్పును వెలువరిస్తూ, ఒక్కో కాల్ కు 1,500 డాలర్ల చొప్పున మొత్తం 2,29,500 డాలర్ల జరిమానా కట్టాలని ఆదేశించారు.