: సండ్రకు రెండు రోజుల ఏసీబీ కస్టడీ


ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ కస్టడీకి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నట్టు తీర్పు వెలువరించింది. మొదటి రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు; రెండోరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు న్యాయవాది సమక్షంలో సండ్రను విచారించాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే అయిన సండ్రపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని, విచారణ సమయంలో ఏసీబీ కార్యాలయంలో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించాలని అధికారులకు స్పష్టం చేసింది. తిరిగి ఈ నెల 11న సండ్రను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News