: డిసెంబర్ నాటికి మీ సేవ ద్వారా 300 సేవలు
మీ సేవ ద్వారా అక్టోబర్ నాటికి 220 రకాల పౌర సేవలను అందుబాటులోకి తెస్తామని ఐటి శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. మీ సేవకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లడారు. డిసెంబర్ నాటికి 300 రకాల పౌర సేవలను మీ సేవ ద్వారా అందిస్తామని చెప్పారు.