: 'మాచర్ల దోపిడీ' దుండగుల నుంచి కోట్ల విలువైన డ్రగ్స్, తుపాకులు స్వాధీనం
గుంటూరు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన దోపిడీ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు, తుపాకులు ఉన్నాయని తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరంతా గతంలో హత్యలు, దోపిడీలు, కిడ్నాపులు, దొంగతనాలు చేసినట్టు కనుగొన్నామని తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తున్నామని, వీరి నుంచి మరింత సమాచారం తెలుసుకోవాల్సి వుందని తెలిపారు. ఈ దుండగులను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గత గురువారం అర్ధరాత్రి మాచర్ల పట్టణ సమీపంలోని ఎంఎస్‌ఆర్ టౌన్ షిప్ లో ఓ వైద్యుడి ఇంట్లోకి జొరబడ్డ ముగ్గురు దుండగులు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.