: తెలీకనే పవన్ అలా మాట్లాడారు: కంభంపాటి రామ్మోహన్ రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు పవన్ కల్యాణ్ కు తెలియకనే విమర్శలు చేసి ఉండవచ్చని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. హోదా కోసం పవన్ తమతో కలసి రావాలని ఆయన సూచించారు. ఏపీకి అధిక నిధులు తెప్పించేలా ఆర్డినెన్స్ తీసుకురావడంలో తాము విజయం సాధించామని కంభంపాటి గుర్తు చేశారు. అభివృద్ధి దిశగా తెలుగుదేశం చేస్తున్న పనులను పవన్ గమనించినట్టు లేరని అభిప్రాయపడ్డారు. గడచిన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టిన సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియాకు విడుదల చేశారు.