: అణుబాంబు వేసేందుకు సై అంటున్న పాక్


పొరుగుదేశాలతో సఖ్యత పెంపొందించుకునేందుకు ఎన్డీయే సర్కారు చేస్తున్న ప్రయత్నాలు పాకిస్థాన్ విషయంలో మాత్రం సఫలం కావడంలేదు. దాయాది దేశం తన నైజం మార్చుకునేందుకు సిద్ధపడడంలేదు. తన కవ్వింపులు, రెచ్చగొట్టే మాటలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఎప్పుడైనా అణుబాంబు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారాయన. "మా మనుగడ కోసం అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం వస్తే తప్పకుండా ఆ పని చేస్తాం. ఆ ఆప్షన్ మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే, ఆ అవసరం రాకూడదనే ప్రార్థిస్తాం. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది" అని పేర్కొన్నారు. తమ రక్షణ రంగం బలంగా ఉందని ఆయన ధీమాగా చెప్పారు. జియో న్యూస్ చానల్ 'జిర్గా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News