: అమెరికాలో మరో దారుణం... తుపాకీ తూటాలకు ముగ్గురు మృతి


తుపాకుల పేలుళ్లతో అమెరికా మరోసారి వణికింది. ఇటీవల దక్షిణ కరోలినా రాష్ట్రంలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే మేరీలాండ్ లో తుపాకీ కాల్పులకు ముగ్గురు మరణించారు. ఈ ఘటన బాల్టిమోర్ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో, వేర్వేరు వాహనాల్లో ఆయుధాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వర్శిటీ ప్రాంతానికి వచ్చారు. వచ్చీరావడంతోనే రోడ్డుపై ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి, మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో మహిళకు చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

  • Loading...

More Telugu News