: స్టార్ కుటుంబం నుంచి మరో చానల్


ఇండియాలో పలు స్పోర్ట్స్, వినోద టెలివిజన్ చానళ్లను అందిస్తున్న స్టార్ ఇండియా గురువారం నాడు మరో చానల్ ను ప్రారంభించింది. కేవలం ఇంగ్లీషు సినిమాలను హై డెఫినిషన్ రూపంలో అందించే ఈ చానల్ పేరు 'స్టార్ మూవీస్ సెలక్ట్'. ఇప్పటికే స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ యాక్షన్ పేరిట రెండు ఆంగ్ల చిత్రాల చానళ్లను స్టార్ ఇండియా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ అధ్యయనంలో యాక్షన్ చిత్రాలు కాకుండా కథాభరిత చిత్రాలను కోరుకుంటున్న వీక్షకుల సంఖ్య పెరుగుతున్నట్టు వెల్లడైందని, అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ చానల్ ను ప్రారంభిస్తున్నామని సంస్థ బిజినెస్ హెడ్ కెవిన్ వాజ్ తెలిపారు. చిత్రం, ధ్వని పరంగా అత్యుత్తమ నాణ్యతను ఈ చానల్ అందిస్తుందని, ఇండియాలో హెచ్ డీ టీవీ చానళ్లు చూస్తున్న కుటుంబాల సంఖ్య 45 లక్షలుగా ఉండడంతో తమ చానల్ కు మంచి వ్యూవర్ షిప్ లభిస్తుందని భావిస్తున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News