: మోదీ విశాఖ పర్యటన వాయిదా
ఈ నెల 16న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన వాయిదా పడింది. హెచ్ పీసీఎల్ నిర్మించిన భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల భూగర్భ ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును ఆ రోజు ప్రధాని జాతికి అంకితం చేసేందుకు విశాఖకు రావల్సి ఉంది. అయితే పర్యటన వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మోదీ ఆరు దేశాల పర్యటనల్లో ఉన్నారు. ఈ రోజు ఆయన కజికిస్థాన్ లో పర్యటిస్తున్నారు.