: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన డీఎస్


కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. డీఎస్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, డీఎస్ తో పాటు ఏవీ సత్యనారాయణ, డి.సురేందర్, ఆర్.సత్యం, బి.కృష్ణమూర్తి, సతీశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ లో చేరారు.

  • Loading...

More Telugu News