: కేసీఆర్ పిలుపుతో మొక్కలు నాటిన 'మా' అధ్యక్షుడు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని ఫిలింఛాంబర్ వద్ద రాజేంద్రుడు మొక్కలు నాటారు. బుల్లితెర నటుడు విజయ్ యాదవ్, ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం పథకం ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు. పచ్చదనం అంటే చెట్టని, చెట్టు అంటే అమ్మ తరువాత అమ్మలాంటిదని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News