: కలప అక్రమ రవాణాను అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారిపై స్మగర్ల దాడి


ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్లు దాడి చేశారు. జిల్లాలోని బోథ్ పరిధిలో అక్రమంగా కలపను స్మగ్లర్లు రవాణా చేస్తున్నట్టు మర్లపల్లి బీట్ అధికారిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే బైక్ పై వెళ్లిన అధికారి స్మగ్లర్ల కారును వెంబడించారు. అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో అధికారి బైక్ ను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి పరారయ్యారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు చంద్రశేఖర్ ను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన గురించి తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News