: పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం


పీఎస్ఎల్వీ- సీ28 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉదయం 7.28 గంటల నుంచి కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 10 రాత్రి 9.58 గంటలకు ఈ రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. పూర్తి వాణిజ్యపరంగా ఇస్రో నిర్వహిస్తోన్న ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన ఐదు ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఖనిజాలు, వాతావరణ పరిస్థితులను ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేయనున్నాయి.

  • Loading...

More Telugu News