: ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, కజకిస్థాన్


విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజార్ బాయ్వేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు కీలక అంశాలపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో యూరేనియం, రక్షణ, రైల్వేలు, క్రీడలు ఉన్నాయి. ఈ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా, నజార్ బాయ్వేకు 75వ జన్మదిన శుభాకాంక్షలను మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగిందని మోదీకి బాయ్వే చెప్పారు.

  • Loading...

More Telugu News