: ప్రధాన హామీని టీఆర్ఎస్ ఇంకా నెరవేర్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని తెలంగాణ రాష్ట్ర సమితి ఇంతవరకు నెరవేర్చకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజకీయాలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News