: సండ్ర బెయిల్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా... కస్టడీపై ముగిసిన వాదనలు


ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటీషన్ పై విచారణను ఏసీబీ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మొన్న ఉదయం తమ ముందు విచారణకు హాజరైన సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టైన వెంటనే నిన్న ఉదయం సండ్ర తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని నేడు విచారిస్తామని నిన్న చెప్పిన న్యాయస్థానం, తాజాగా ఈ పిటీషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, సండ్రను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలన్న ఏసీబీ పిటీషన్ పై కోర్టులో కొద్దిసేపటి క్రితం వాదనలు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 4 గంటలకు కస్టడీపై తీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

  • Loading...

More Telugu News