: జైలుకు వెళ్లడానికైనా, కోర్టు కేసులను ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే: పవన్ కల్యాణ్


"నేను జైలుకు వెళ్లడానికైనా, కోర్టు కేసులను ఎదుర్కోవడానికైనా సిద్ధమే. అందుకు తగిన ఏర్పాట్లను త్వరగా చేస్తే మంచిది" అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ కొంతమంది నిన్న (మంగళవారం) పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేసినట్టు పవన్ మరో ట్వీట్ లో స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ తెలంగాణ న్యాయవాదులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పవన్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ క్రమంలోనే పవన్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు.

  • Loading...

More Telugu News