: ఆ పాప తండ్రి వల్లే ప్రమాదం: హేమమాలిని


రాజస్థాన్ లో జరిగిన కారు ప్రమాదంపై నటి హేమమాలిని తొలిసారి స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ రెండేళ్ల చిన్నారి మరణించడం తనను కలచివేసిందని, ఆ పాప తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వుంటే ఈ ప్రమాదం జరిగి వుండేది కాదని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె అభిప్రాయపడ్డారు. అన్యాయంగా ఓ చిన్నారి బలైందని, కొందరికి గాయాలయ్యాయని, కారును నడుపుతున్న వ్యక్తి నిబంధనలు పాటించివుంటే ఓ చిరు ప్రాణం పోయేది కాదని అన్నారు. ప్రమాదం తరువాత కనీస మానవత్వం చూపకుండా హేమమాలిని అక్కడి నుంచి వెళ్లిపోయిందని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించారు. ఆ సమయంలో తనకు దెబ్బలు తగిలి, అపస్మారక స్థితిలో ఏమీ చేయలేక ఉన్నానని, ఆసుపత్రికి ఎలా వెళ్లానో కూడా తెలియదని అన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News