: సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కు తీవ్ర అనారోగ్యం... ఐసీయూలో చికిత్స


ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్(87) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయనను కొన్ని రోజుల కిందటే చెన్నైలోని అడయార్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. గతరాత్రి విశ్వనాథన్ పరిస్థితి విషమించడంతో, ఐసీయూకి మార్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిసింది. అయితే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. అంతకుముందు ఆరోగ్యం మెరుగుపడిందనీ, ఇంటికీ తీసుకువెళదామని అనుకుంటున్న సమయంలోనే విశ్వనాథన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి లోనయ్యారని సమాచారం. ఆసుపత్రిలో విశ్వనాథన్ ను సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పరామర్శించారు.

  • Loading...

More Telugu News