: పెద్దల సినిమాలకు 'యు/ఏ', అక్రమాల సెన్సార్ బోర్డు... నిప్పులు చెరిగిన కాగ్
సెన్సార్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని కాగ్ వెల్లడించింది. పెద్దలు మాత్రమే చూడాల్సిన ఏ-సర్టిఫికెట్ సినిమాలకు పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడొచ్చంటూ 'యూ/ఏ' సర్టిఫికెట్లను కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు (సీబీఎఫ్ సీ) ఇస్తోందని ఆరోపించింది. పలు సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ల జారీ ఆలస్యం చేస్తోందని తెలిపింది. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. అక్టోబర్ 2013 నుంచి మార్చి 2015 మధ్య ముంబైలోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసినట్టు తెలిపింది. మొత్తం 172 'పెద్దల' చిత్రాలను 'యు/ఏ'గా, 166 'యు/ఏ' చిత్రాలను 'యు' కేటగిరీలోకి మార్చారని, ఇందులో అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది.