: ఇడుపులపాయలో వైఎస్ జగన్ కుటుంబం...66 జయంతి సందర్భంగా వైఎస్ కు నివాళి


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 66 వ జయంతి వేడుకలు కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలోని తమ సొంత క్షేత్రం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధిని సందర్శించారు. తల్లి విజయలక్ష్మితో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి ఇడుపులపాయ వెళ్లిన జగన్, వైఎస్ కు ఘన నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే, ఏపీలోనే కాక తెలంగాణలోనూ వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాల్లోని వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News