: జపాన్ మెట్రోలో బాబు చక్కర్లు!
జపాన్ రాజధాని నగరం టోక్యోలో చంద్రబాబునాయుడు బృందం మెట్రోరైలెక్కింది. 2020లో ఒలంపిక్స్ జరిగే ప్రాంతాన్ని బాబు బృందం కలయదిరిగింది. మెట్రో రైలెక్కిన చంద్రబాబు డ్రైవర్ పక్కనే కూర్చుని ఎత్తయిన భవనాలు, రహదారులు, అక్కడి మౌలిక వసతులు పరిశీలిస్తూ, 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. వినూత్నంగా కనపడిన భవనాల వివరాలు, వంతెనలను గురించి అడిగి తెలుసుకున్నారు. బాబు వెంట రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడుతో పాటు దౌత్యాధికారులు, జపాన్ బృందం వుంది. అంతకుముందు ఆయన జేజీసీ కార్పొరేషన్ తో సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంవైపు జేజీసీ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.