: బైక్ రిపేరింగ్ లో ధోనీ బిజీబిజీ!


టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చాలాకాలం తర్వాత కాస్తంత విశ్రాంతి చిక్కింది. జింబాబ్వే టూర్ కు నిన్న భారత జట్టు ధోనీ సహా ఇతర సీనియర్లు లేకుండానే విమానం ఎక్కేసింది. సాధారణంగా ఏమాత్రం వీలు చిక్కినా తన ఖరీదైన బైక్ లపై సొంత నగరం రాంచీలో చక్కర్లు కొట్టే ధోనీ, నిన్న తన బైకులను రిపేర్ చేసుకుంటూ బిజీబిజీగా గడిపాడు. ఇంటిలోని గ్యారేజీకే కొంతమంది మెకానిక్ లను పిలిపించుకున్న ధోనీ, స్పానర్లు చేతబట్టి బైకుల రిపేరింగ్ లో స్వయంగా పాలుపంచుకున్నాడు. ఎల్లో టీ షర్ట్, బ్లాక్ షార్ట్ తో ధోనీ బైక్ రిపేరింగ్ లో పూర్తిగా లీనమైపోయాడు.

  • Loading...

More Telugu News