: జ్వాల నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే... లేకుంటే కఠిన చర్యలేనంటున్న సాయ్!


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల వ్యాఖ్యలపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఎట్టకేలకు స్పందించింది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై విమర్శలు గుప్పిస్తున్న జ్వాల ఇకపై తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని కూడా కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సాయ్ డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ కోచ్, సాయ్, క్రీడా మంత్రిత్వ శాఖ ఏ ఒక్క ప్లేయర్ పై ఎప్పుడూ వివక్ష చూపలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘క్రీడాకారుడిగానే కాక కోచ్ గా, అధికారిగా పుల్లెల గోపీచంద్ నిజాయతీని ప్రశ్నించడానికి లేదు. ఆట కోసం గోపీచంద్ చేస్తున్న సేవలు అసమానమైనవి. ఓ అథ్లెట్ చేసే నిరాధార ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గోపీచంద్ పై గుత్తా జ్వాల ఆరోపణలు అర్థరహితం’’ అని ఆయన అన్నారు. ప్రతిసారి నోరు పారేసుకుంటున్న గుత్తా జ్వాల ‘లక్ష్మణ రేఖలు’ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందంటూ శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News