: గులాబీ గూటికి నేడు డీఎస్... కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషియన్, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గానే కాక వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డీఎస్, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చూపించిన తెగువ, ఉద్యమ స్ఫూర్తి తనను టీఆర్ఎస్ వైపు ఆకర్షించాయని డీఎస్ పేర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేయాలన్న సంకల్పంతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు డీఎస్ చెప్పారు. నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో డీఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News