: షాహిద్ నన్ను పిలవలేదు...మీడియా అతి చేస్తోంది!: కరీనా కపూర్
మాజీ లవర్ షాహిద్ కపూర్ వివాహానికి తనకు ఆహ్వానం అందలేదని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. తొలి వివాహ ఆహ్వాన పత్రికను షాహిద్, కరీనాకు ఇచ్చినట్టు బాలీవుడ్ లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఓ కార్యక్రమంలో కలిసిన షాహిద్ వివాహం చేసుకుంటున్నానని అక్కడ చెప్పాడని కరీనా తెలిపింది. ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ మలేషియాలో కలిసిన సంగతి తెలిసిందే. షాహిద్ వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని కరీనా ఆకాంక్షించింది. షాహిద్ వివాహం విషయంలో మీడియా అతి చేస్తోందని కరీనా ఆక్షేపించింది. వివాహం వ్యక్తిగతమైనదని, దానిని అతని ఇష్టానికి వదిలేయాలని, ప్రతి విషయం మీదా కుతూహలం సరికాదని కరీనా మీడియాకు మొట్టికాయలు వేసింది.