: ఈ కండలు సరిపోవు...ఇంకా పెంచాలి!: సల్మాన్ ఖాన్


యష్ రాజ్ ఫిల్మ్స్ లో చేయనున్న సినిమా కోసం చాలా కష్టపడాలని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. అనారోగ్య సమస్యలపై వచ్చిన వార్తలపై ముంబైలో స్పందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఈద్ కు సినీ అభిమానుల ముందుకు రానున్న 'సుల్తాన్' కోసం సిద్ధమవుతున్నానని అన్నాడు. ప్రస్తుతం ఉన్న కండలు సరిపోవని, పాత్ర కోసం మరిన్ని కండలు పెంచాలని సల్లూ భాయ్ తెలిపాడు. ఈ సినిమాలో తన పాత్ర బలవంతుడిగా కనిపిస్తుందని, అందుకు మజిల్స్ బాగా పెంచాలని చెప్పాడు. దాని వల్ల తన శరీరంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని సల్మాన్ పేర్కొన్నాడు. నవంబర్ నుంచి సుల్తాన్ షూటింగ్ ప్రారంభం కానుందని సల్మాన్ చెప్పాడు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, అలీ అబ్బాస్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ ఈద్ కు 'భజరంగీ భాయ్ జాన్'గా సల్లూభాయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  • Loading...

More Telugu News