: పవన్ పుండుమీద కారం చల్లినట్టు వ్యాఖ్యానించారు: టీడీపీ నేత సోమిరెడ్డి
పుండు మీద కారం చల్లినట్టు పవన్ కల్యాణ్ మాట్లాడారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, సెక్షన్ 8పై పవన్ కల్యాణ్ మాటలు సమర్థనీయం కాదని అన్నారు. హైదరాబాదులో ఆంధ్రులకు సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్రులు వివక్షకు గురవుతుంటే సెక్షన్ 8 కాకుండా ఇంకేం చేయాలని ఆయన ప్రశ్నించారు. వివక్ష అన్యాయం కాదా? దానిని నేతలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. వివక్షపై ప్రజలు ఎలా స్పందిస్తారని ఆయన చెప్పారు. చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్ 8ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.