: బంతి బలంగా తగలడంతో తమిళ సంతతి క్రికెటర్ మృతి
క్రికెట్ ప్రపంచం మరోసారి విషాదంలో మునిగిపోయింది. బ్రిటన్ లో ఓ తమిళ సంతతి క్రికెటర్ మృత్యువాత పడ్డాడు. బవలన్ పద్మనాభన్ (24) అనే క్రికెటర్ సర్రే కౌంటీలో నిర్వహించిన బ్రిటీష్ తమిళ్ లీగ్ లో మణిపాయ్ పారిష్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని ఛాతీకి బలంగా తాకింది. దీంతో, అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని హుటాహుటీన ఎయిర్ అంబులెన్స్ లో కింగ్ స్టన్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బలమైన దెబ్బతగలడంతో పద్మనాభన్ ప్రాణాలు పోయాయి. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగానే చనిపోయి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు.