: మా అన్నయ్య బాగానే ఉన్నాడు... ఏమీ కాలేదు: సల్మాన్ సోదరి ట్వీట్


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అనారోగ్యం పాలయ్యాడని, వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో ఆయనకు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారని బాలీవుడ్ లో కథనాలు బాగా వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై సల్మాన్ సోదరి అర్పిత స్పందించారు. తన సోదరుడికి ఏమీ కాలేదని, బాగానే ఉన్నాడని ట్విట్టర్లో తెలిపారు. తమపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సల్మాన్ నటించిన 'భజరంగి భాయిజాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 17న విడుదల కానుంది. ఇందులో సల్మాన్ సరసన కరీనా నటించింది. కాగా, సల్మాన్ ఆరోగ్యంపై ఐఏఎన్ఎస్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం... కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, షూటింగులతో సల్మాన్ కు తీరిక లేకుండా పోయిందని, బిజీ షెడ్యూల్ కారణంగా శరీరంపై భారం ఎక్కువైందని, అందుకే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.

  • Loading...

More Telugu News