: ఒక్కడే పోలీస్...పైగా అంధుడు...నేరాలు మాత్రం నిల్!


వందల మంది పోలీసులు కలసి సాధించని ఘనత ఒకే ఒక్క పోలీస్ సాధించాడు. మామూలుగా ఏదైనా పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పదుల సంఖ్యలో పోలీసులు ఉంటారు. కానీ చైనాలోని గుయ్ జౌలోని లిన్ బా టౌన్ లోని సి చాంగ్ పోలీస్ స్టేషన్లో గత పదేళ్లుగా ఒకే ఒక పోలీస్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత పదేళ్లలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు చోటుచేసుకోకపోవడం విశేషం. యన్ పాంగ్ అనే ఈ పోలీస్ అధికారి 2002లో ప్రమాదవశాత్తూ చూపుకోల్పోయారు. దీంతో అంధుడిగా మారారు. అయినా సరే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రోజూ టౌన్ మొత్తం తిరుగుతారు. ఎలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ ఘనతపై ఆయన మాట్లాడుతూ, తన భార్య సహకారం లేకుంటే ఇది సాధ్యం కాదని ఆయన చెప్పారు. కాగా, ఆయన భార్య టావో హంగ్ యింగ్ రైల్వే స్టేషన్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తారు. భర్త సెక్యూరిటీ చెకింగ్ కు వెళ్లేటప్పుడు ఆమె కూడా వెళ్తారు. ఏదైనా అనుమానం వస్తే తీసుకోవాల్సిన చర్యలను భర్తకు వివరిస్తారు. సమాజానికి సేవచేయడం భాగ్యంగా భావించే వారిద్దరి వల్ల గత పదేళ్లలో లిన్ బా టౌన్ లో ఎలాంటి నేరాలు చేసుకోకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News