: పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ట్విట్టర్ ఫీచర్
ఖాతాదారుల సౌకర్యార్థం సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ అప్ డేట్ అవుతుంటుంది. అందులో భాగంగానే ట్విట్టర్ కొత్తగా ఓ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ ఇకనుంచి వినియోగదారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆ రోజు వినియోగదారుడి ట్విట్టర్ పేజీని బెలూన్లతో నింపేసి ట్వీట్ల ద్వారా విసెష్ చెబుతుంది. ఇందుకోసం ట్విట్టర్ పేజీలో పుట్టిన రోజు తేదీ చేర్చాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై పూర్తిగా ఖాతాదారుడిదే తుది నిర్ణయం. తేదీకి సంబంధించి పూర్తి ప్రైవసీ కూడా ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ద్వారా పుట్టిన రోజును ప్రొఫైల్ లో చేర్చవచ్చు.