: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సుజనా చౌదరి స్పందన
ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందించారు. వ్యాపార వేత్తలు రాజకీయాల్లోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. వ్యాపారం నీతిగా చేస్తున్నామా? లేదా? అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. అసలు ఏపీ ఎంపీలు ఎలా పనిచేస్తున్నారో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగా పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.