: ఫ్యాన్స్ భద్రత కోసం పోలీసుల సాయం కోరిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానుల భద్రత పట్ల ఆందోళన చెందుతున్నారు. ముంబయిలోని తన నివాసం 'జల్సా' వద్ద ఆయన ప్రతి ఆదివారం ఫ్యాన్స్ తో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమానికి అభిమానగణం పెద్ద ఎత్తున తరలి వస్తుండడమే 'బిగ్ బి' ఆందోళనకు కారణం. అలా వచ్చే అభిమానుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉండడంతో, ఆ జన సమూహంలో తొక్కిసలాట కారణంగా వారు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో, అభిమానులను నియంత్రించేందుకు అమితాబ్ పోలీసుల సాయం కోరారు. పోలీసులు ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపుతారని భావిస్తున్నట్టు ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ భావోద్వేగ భరితులవుతారని, అలాంటప్పుడు వారిని అడ్డుకోవాల్సి రావడం ఎంతో బాధాకరమని అన్నారు.