: భక్తుల సౌకర్యార్థం భద్రాచలం రామయ్య వెబ్ సైట్


గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భద్రాచలం వెబ్ సైట్ ప్రారంభించారు. www.bhadrachalam.co.in, www.badrachalam.co.in పేరుతో రూపొందించిన వెబ్ సైట్ లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. పుష్కర దర్శనం, శీఘ్రదర్శనం, నిత్యకల్యాణం, సహస్రనామార్చన, వూంజల్ సేవ తదితర సేవలకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పుష్కరాల సమయంలో రోజుకు 20 గంటలు స్వామివారి దర్శనం ఉంటుందని చెప్పారు. స్వామివారికి ప్రతిరోజు 10 గంటల నుంచి నిత్యకల్యాణం, సాయంత్రం 4 నుంచి 5 వరకు సహస్రనామార్చన, 7 నుంచి 8 వరకు వూంజల్ సేవ ఉంటుందని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News